Share News

జర్మనీ వర్సిటీ ఐఐబీఎంపీ ప్రవేశాలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌

ABN , Publish Date - Sep 05 , 2026 | 01:17 AM

జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం అనంతపురం జేఎన్టీయూ వర్సిటీలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వీసీ హెచ్‌.సుదర్శనరావు, కలికిరి జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు.

జర్మనీ వర్సిటీ ఐఐబీఎంపీ ప్రవేశాలకు ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌

కలికిరి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జర్మనీలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారి కోసం అనంతపురం జేఎన్టీయూ వర్సిటీలో ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వీసీ హెచ్‌.సుదర్శనరావు, కలికిరి జేఎన్టీయూ ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ అండ్‌ మాస్టర్‌ ప్రోగ్రామ్‌ (ఐఐబీఎంపీ) బీటెక్‌ కోర్సులో ప్రవేశాలతో అంతర్జాతీయ స్థాయి విద్యావకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఈ నెల 7, 8 తేదీల్లో జేఎన్టీయూ వర్సిటీ ప్రాంగణంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జర్మన్‌ విశ్వవిద్యాలయం ప్రతినిధులు కూడా డెస్క్‌లో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఐఐబీఎంపీతో అనుసంధానంగా బీటెక్‌లో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు నిర్ణీత తేదీల్లో హెల్ప్‌డెస్క్‌ను సందర్శించవచ్చని కోరారు. ఈ కోర్సులో ప్రవేశాల కోసం 90441 15999, 90441 17999 నెంబర్లను సంప్రదించాల్సిందిగా వీసీ సుదర్శన రావు, ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావు కోరారు.

Updated Date - Sep 05 , 2026 | 01:17 AM