ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:48 PM
ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా రవాణాశాఖాధికారి (డీటీవో) కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు
తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా రవాణాశాఖాధికారి (డీటీవో) కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. ఈ మేరకు క్యారేజ్ వాహనాలపై(ట్రావెల్స్ బస్సులపై) ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 40 బస్సులపై కేసులు నమోదు చేశారు. జగదల్పూర్ నుంచి తిరుపతివైపు ప్రయాణిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ స్లీపర్ బస్సు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆదివారం తనిఖీల్లో గుర్తించడంతో ఎంవీఐ శ్రీనివాసరావు సీజ్ చేశారు. డీటీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రవాణా శాఖ నిబంధనలు పాటించి రహదారి భద్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తనిఖీల్లో ఎంవీఐలు దామోదరనాయుడు, అతికానాజ్, మోహన్‌కుమార్, రమణ నాయక్, ప్రసాద్‌వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.