7న దివ్యాంగశక్తి బస్ పాసులకు స్పెషల్ డ్రైవ్
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:36 AM
దివ్యాంగశక్తి’ పథకం అమలు విషయంలో ఆర్టీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉచిత ప్రయాణ బస్ పాసుల జారీ కోసం ఈనెల 7న స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డీపీటీవో జగదీష్ జిల్లా వ్యాప్తంగా వున్న డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి అర్బన్, మార్చి 31(ఆంధ్రజ్యోతి): ‘దివ్యాంగశక్తి’ పథకం అమలు విషయంలో ఆర్టీసీ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఉచిత ప్రయాణ బస్ పాసుల జారీ కోసం ఈనెల 7న స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని డీపీటీవో జగదీష్ జిల్లా వ్యాప్తంగా వున్న డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి సెంట్రల్ బస్‌స్టేషన్, శ్రీకాళహస్తి, పుత్తూరు, సూళ్లూరుపేట, వాకాడు, వెంకటగిరి, సత్యవేడు, నాగలాపురంలో బస్ పాసుల జారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో దివ్యాంగులకు పాసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆధార్, సందరం సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజు ఫొటో తీసుకెళ్లి బస్ పాస్ పొందవచ్చని డీపీటీవో తెలిపారు.