నేడు, రేపు సర్ అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక శిబిరాలు
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:31 AM
‘సర్’ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఈ నెలలో నాలుగు రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 23, 29, 30 తేదీలలో జిల్లావ్యాప్తంగా 1708 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు.
చిత్తూరు కలెక్టరేట్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాలపై అభ్యంతరాల స్వీకరణలో భాగంగా ఈ నెలలో నాలుగు రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్ కుమార్ ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22, 23, 29, 30 తేదీలలో జిల్లావ్యాప్తంగా 1708 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారన్నారు. ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉండి ఓటర్ల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారన్నారు. ఓటర్లు తమ పేర్లను పరిశీలించుకోవడానికి ఇక్కడ అన్నిరకాల జాబితాలు, బీఎల్వోలు సిద్ధంగా ఉంచుకుంటారన్నారు. కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తప్పుల సవరణకు సంబంధించి ఫారాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ఓటర్లందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక అధికారులు అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తారని కలెక్టర్ వివరించారు.