పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:52 AM
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు కొత్తచట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిఒక్కరు పుస్తక పఠనం చేస్తే మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు.
- హైకోర్టు జస్టిస్ జయసూర్య
చిత్తూరు లీగల్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి):నూతనంగా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తులు కొత్తచట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతిఒక్కరు పుస్తక పఠనం చేస్తే మేధాశక్తి పెరుగుతుందని తెలిపారు. అంతకుముందు జిల్లా కోర్టు సముదాయాల ఆవరణలో మొక్క నాటి, నీరు పోశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలును ప్రారంభించారు. వర్క్‌షా్‌పకు హాజరైన న్యాయమూర్తులకు పూలమొక్కలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, రిటైర్డ్ జిల్లా జడ్జిలు విరూపాక్ష, దత్తాత్రేయ, కృష్ణయ్యతో పాటు పలువురు న్యాయమూర్తులు, సిబ్బంది పాల్గొన్నారు.