సీఎం భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:29 AM
సీఎం చంద్రబాబు పర్యటన భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. అక్టోబరు 2న చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ప్రముఖులు మదనపల్లెకు
మదనపల్లె క్రైం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు పర్యటన భద్రతా ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ ధీరజ్ పరిశీలించారు. అక్టోబరు 2న చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ప్రముఖులు మదనపల్లెకు విచ్చేస్తున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. ఆయన మాట్లాడుతూ కొండామర్రిపల్లె సమీపంలోని హెలిప్యాడ్, బీకేపల్లెకాలనీలో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాలను పరిశీలించామన్నారు. వీఐపీ కాన్వాయ్, రూట్ మ్యాప్‌లపై పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఇతర శాఖల సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు. డీఎస్పీ బుచ్చిరాజు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.