భానుడు భగభగ
ABN , Publish Date - Apr 30 , 2026 | 01:42 AM
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో గంగవరం మళ్లీ ఆరెంజ్ జోన్‌లోకి వెళ్ళింది.
19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి ఎండలు
వాతావరణశాఖ చెప్పినట్లే బుధవారం జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. 19 మండలాల్లో 40 డిగ్రీలకు మించి పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతతో గంగవరం మళ్లీ ఆరెంజ్ జోన్‌లోకి వెళ్ళింది. మండలాల వారీగా.. బంగారుపాళ్యం, తవణంపల్లె, గంగవరంలో 42.8, శ్రీరంగరాజపురంలో 42.0, పాలసముద్రంలో 41.8, పెద్దపంజాణిలో 41.6, నగరి, గుడిపాలలో 40.8, చిత్తూరు అర్బన్, చిత్తూరు రూరల్, పలమనేరులో 40.4, నిండ్ర, పెనుమూరు, వెదురుకుప్పంలో 40.3, పూతలపట్టులో 40.1, ఐరాల, పులిచెర్ల, రొంపిచెర్లలో 40.0, గంగాధరనెల్లూరులో 39.5, యాదమరిలో 39.0, రామకుప్పం, శాంతిపురంలో 38.7, బైరెడ్డిపల్లెలో 38.5, కుప్పంలో 37.5, వి.కోటలో 37.2, గుడుపల్లెలో 36.8, కార్వేటినగరంలో 36.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి