Share News

సరి‘హద్దు’ సమస్యను పరిష్కరించండి

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:25 AM

పులికాట్‌ సరస్సులో తమిళనాడు మత్స్యకారులు కొత్తగా తాటిమొద్దులను నాటి, దానినే సరిహద్దుగా నిర్ణయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మత్స్యకార నాయకులు సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయికి విన్నవించారు. సోమవారం ఆర్డీవో కిరణ్మయిని కలిసి పులికాట్‌లో సరిహద్దు సమస్యను వివరించారు.

సరి‘హద్దు’ సమస్యను పరిష్కరించండి
ఆర్డీవో కిరణ్మయికి వినతిపత్రం అందజేస్తున్న మత్స్యకార నాయకులు

తడ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): పులికాట్‌ సరస్సులో తమిళనాడు మత్స్యకారులు కొత్తగా తాటిమొద్దులను నాటి, దానినే సరిహద్దుగా నిర్ణయించి బెదిరింపులకు పాల్పడుతున్నారని మత్స్యకార నాయకులు సూళ్లూరుపేట ఆర్డీవో కిరణ్మయికి విన్నవించారు. సోమవారం ఆర్డీవో కిరణ్మయిని కలిసి పులికాట్‌లో సరిహద్దు సమస్యను వివరించారు. తాము ఎటువంటి గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా చేపల వేట సాగిస్తున్నా తమిళనాడు మత్స్యకారులు తమను అడ్డుకోవడమేకాకుండా సరిహద్దుల పేరుతో దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే పలుమార్లు అక్కడ మత్స్యకార నాయకులతో చర్చలు జరిపినా ఫలితం లేకుండాపోయిందన్నారు. తమిళనాడు అధికారులతో మాట్లాడి సరిహద్దు సమస్య పరిష్కరించాలని కోరారు. స్పందించిన కిరణ్మయి తమిళనాడులోని పొన్నేరి ఆర్డీవోతో మాట్లాడి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆర్డీవోను కలిసిన వారిలో బెస్త కార్పొరేషన్‌ చైర్మన్‌ బొమ్మన శ్రీధర్‌, పులికాట్‌ మత్స్యకార సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్‌, శివలింగం, నాయకులు రాజేంద్రన్‌, జయపాల్‌, వాసు తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 20 , 2026 | 01:25 AM