Share News

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:49 AM

పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే అర్జీదారుడు తన సమస్య పరిష్కారమై సంతృప్తి చెందాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 279 మంది అర్జీలు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కారం
కలెక్టరేట్‌లో అర్జీదారులను విచారిస్తున్న కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

మదనపల్లె టౌన్‌, జూలై 13(ఆంధ్రజ్యోతి): పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే అర్జీదారుడు తన సమస్య పరిష్కారమై సంతృప్తి చెందాలని కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 279 మంది అర్జీలు అందజేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

కేవీపల్లె మండలం గ్యారంపల్లె జడ్పీ హైస్కూల్‌ హెచ్‌ఎం దళిత విద్యార్థిని వేధించారని, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లపై విచారించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విద్యార్థి తల్లి ఆదిలక్ష్మి కలెక్టర్‌కు విన్నవించారు.

తాను కొనుగోలు చేసిన స్థలంలోకి రానీయకుండా శ్రీకాంత్‌, విశ్వనాథ్‌ అనే ఇద్దరు దౌర్జన్యం చేస్తున్నారని మదనపల్లె పట్టణానికి చెందిన మూని రాజశేఖర్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

తన ఆస్తిని చిన్న కుమార్తె రాయించుకుని ఇంటి నుంచి గెంటి వేసిందని రామసముద్రం మండలం గుంతలపేటకు చెందిన వృద్ధురాలు లక్ష్మమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది.

జిల్లాలో చేపట్టిన సర్‌ కార్యక్రమం గడువు పెంచాలని సీపీఐ పట్టణ కార్యదర్శి మురళి కలెక్టర్‌కు విన్నవించారు.

వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించాలని ఆ సంఘం నాయకులు నరసింహులు, విష్ణుచైతన్య, భాస్కర్‌, గోవిందు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి పీజీఆర్‌ఎ్‌సలో అర్జీ అందజేశారు.

వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు

కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎ్‌సకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. మెయిన్‌ గేట్‌ నుంచి పీజీఆర్‌ఎస్‌ హాలుకు వెళ్లాలంటే 100 మీటర్లు నడవాల్సి ఉంది. వృద్ధులు, దివ్యాంగులు అంతదూరం నడవలేక సహాయకులను ఆశ్రయించాల్సి వస్తోంది. కొంతమంది ఊతకర్రలు చేత పట్టుకుని వస్తుంటే, మరికొందరు వంగిన నడుము చేతపట్టుకుని నడుస్తూ అవస్థలు పడుతున్నారు. వాస్తవంగా కలెక్టరేట్‌కు వచ్చే వృద్ధులు, దివ్యాంగుల కోసం మూడు వీల్‌చైర్‌లను ఏర్పాటు చేసినా అవి వాడకుండా మూలన పడేశారు. వారికోసం ప్రత్యేకంగా క్యూ లైన్‌ పెట్టి అర్జీలు తీసుకునేలా ఏర్పాటు చేయాలని దివ్యాంగుల సంఘం నాయకుడు సుబ్రమణ్యంరెడ్డి కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:49 AM