ట్రావెల్ బస్సులో పొగలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:05 AM
తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మోజో ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
తిరుపతి(కొర్లగుంట), ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన మోజో ట్రావెల్స్ బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.బుధవారం సాయంత్రం 6.30గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈలోపు వైర్ల నుంచి పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై బస్సులో నుంచి కిందకు దిగేశారు. అనంతరం ట్రావెల్స్ యాజమాన్యం వారందరికీ టిక్కెట్ల సొమ్ము రీఫండ్ చేసింది. ప్రయాణికులంతా మరొక బస్సులో హైదరాబాద్‌కు వెళ్లారు.