Share News

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

ABN , Publish Date - Aug 15 , 2026 | 01:24 AM

తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్‌ క్రాంతి వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఏపీ సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
కోచ్‌ కింది భాగంలో వస్తున్న పొగలు

రేణిగుంట, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): తిరుపతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఏపీ సంపర్క్‌ క్రాంతి వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.తిరుపతి నుంచి బయలుదేరిన రైలు రేణిగుంట దాటి వెళ్తుండగా మామండూరు సమీపంలో శుక్రవారం ఉదయం 6.45గంటల సమయంలో ఎస్‌-1 కోచ్‌ కింది భాగంలో బ్రేక్‌ షూ నుంచి పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. లోకో పైలట్‌ రైలును ఆపివేసి ఎస్‌-1కోచ్‌ కింది భాగాన్ని గమనించారు. బ్రేక్‌ షూ నుంచి పొగలు వస్తున్నట్టు గుర్తించారు. రైలు బ్రేక్‌ వేయడంతో బ్రేక్‌ షూ వేడెక్కి పొగలు వచ్చినట్టు ఆయన నిర్దారించారు. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించుకున్న తర్వాత రైలును యథావిధిగా ముందుకు నడిపించారు.

Updated Date - Aug 15 , 2026 | 01:25 AM