డ్రోన్‌తో ‘స్కైవర్టైజింగ్’
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:05 AM
ఆధునిక సాంకేతిక విప్లవంతో అడ్వర్టైజింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘స్కైవర్టైౖజింగ్’గా పిలిచే డ్రోన్ కెమెరాలతో ప్రకటనల ప్రచారం తిరుపతిలో మొదలైంది.
తిరుపతి సిటీ, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక విప్లవంతో అడ్వర్టైజింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘స్కైవర్టైౖజింగ్’గా పిలిచే డ్రోన్ కెమెరాలతో ప్రకటనల ప్రచారం తిరుపతిలో మొదలైంది.ఇస్కాన్ మైదానంలో శనివారం రాత్రి ఎయిర్‌పిక్సెల్ సంస్ధకు చెందిన భారీ డ్రోన్ నింగిలో ఎగురుతూ ప్రచారం చేస్తూ కనిపించింది. 20 అడుగుల పొడవు,10 అడుగుల వెడల్పు కలిగిన డిజిటల్ స్ర్కీన్‌ను డ్రోన్ ద్వారా దాదాపు 12 అంతస్తుల భవనం ఎత్తుకు తీసుకెళ్లి తిప్పారు. పెళ్లిళ్లు, పంక్షన్లు, జనసందోహం ఉన్న చోట ఇలాంటి ప్రకటనల పట్ల ఆసక్తిచూపుతారని నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. ఇండియాలోనే తమది తొలి స్కైవర్టైజింగ్ స్టార్ట్‌పగా ఆమె చెప్పుకొచ్చారు.