Share News

కొండెక్కిన కోడిగుడ్లు

ABN , Publish Date - Nov 14 , 2026 | 02:07 AM

కోడిగుడ్డు కొండెక్కింది.జూన్‌, జూలై మాసాల్లో 5 నుంచి 6 రూపాయలు పలికిన గుడ్డు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 6 నుంచి 7 రూపాయల రేటు పలుకుతూవచ్చింది. నవంబరు మొదటి వరకు ఈ ధర కొనసాగింది. అయితే ఆకస్మాత్తుగా ఈ ధర 9 రూపాయలకు చేరుకుంది.

కొండెక్కిన కోడిగుడ్లు

తడ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): కోడిగుడ్డు కొండెక్కింది.జూన్‌, జూలై మాసాల్లో 5 నుంచి 6 రూపాయలు పలికిన గుడ్డు ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 6 నుంచి 7 రూపాయల రేటు పలుకుతూవచ్చింది. నవంబరు మొదటి వరకు ఈ ధర కొనసాగింది. అయితే ఆకస్మాత్తుగా ఈ ధర 9 రూపాయలకు చేరుకుంది. 10 రోజుల క్రితం వరకు 30 కోడిగుడ్ల ట్రే ధర 180 నుంచి 200 రూపాయల ధర పలికితే ప్రస్తుతం 270 రూపాయల పై మాటే.ఇప్పటికే మటన్‌ కేజీ 1000 రూపాయలు దాటిపోగా, చికెన్‌ 300 రూపాయల దరిదాపుల్లోకి చేరుకుంది. ఇప్పుడు కోడిగుడు సైతం కొండెక్కడంతో సామాన్యుడు అమ్మో అనే పరిస్థితి వచ్చింది.సరైన ఉత్పత్తి లేకపోవడంతో పాటు కోళ్ల దాణా రేట్లు పెరిగిపోవడంతో కోడిగుడ్ల ధర పెరిగిపోయిందంటున్నారు వ్యాపారులు.

Updated Date - Nov 14 , 2026 | 02:07 AM