Share News

‘కడా’కు స్కోచ్‌ అవార్డు

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:19 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుప్పం నియోకవర్గంలో అమలు చేస్తున్న పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పీ-4), నెట్‌ జీరో కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (కడా) ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డును సొంతం చేసుకుంది.

‘కడా’కు స్కోచ్‌ అవార్డు
స్కోచ్‌ అవార్డు అందుకుంటున్న కడా పీడీ వికాస్‌ మర్మత్‌, పీకేఎం ఉడా చైర్మన్‌ సురేష్‌ బాబు

కుప్పం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుప్పం నియోకవర్గంలో అమలు చేస్తున్న పబ్లిక్‌ ప్రైవేట్‌ పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పీ-4), నెట్‌ జీరో కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసినందుకు కుప్పం ఏరియా డెవల్‌పమెంట్‌ అథారిటీ (కడా) ప్రతిష్ఠాత్మక స్కోచ్‌ అవార్డును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో శనివారం జరిగిన 109 స్కోచ్‌ సమ్మిట్‌లో కడా ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వికాస్‌ మర్మత్‌ అవార్డును అందుకున్నారు. పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ బీఆర్‌.సురేష్‌ కుమార్‌ హాజరయ్యారు. స్వర్ణకుప్పం - విజన్‌ 2029లో భాగంగా నియోజకవర్గంలోని కుటుంబాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యం చేసుకుని పీ-4 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. 8,904 బంగార కుటుంబాలను గుర్తించారు. పీ- 4 ద్వారా వారికి ఆదాయ మార్గం చూపించి, జీవన ప్రమాణాలను పెంచుతున్నారు. ఇప్పటికే 1,217 కుటుంబాలు లబ్ధి పొందాయి. స ్వయం ఉపాధి పొందడమే కాకుండా, పదుగురికీ ఉపాధిని చూపించగలుగుతున్నాయి. కడా, ఐఐటీ కాన్పూర్‌ తదితర సంస్థల సహకారంతో వికేంద్రకృత పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు అమలు చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్తు, గృహాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌, ప్రభుత్వ హాస్టళ్లు, విద్యా సంస్థల్లో సౌర విద్యుత్తు, స్మార్ట్‌ మీటరింగ్‌, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ వంటి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది.. ఈ రెండు పథకాలు విజయవతంగా అమలు అవుతుండడంతో స్కోచ్‌ అవార్డుతో జాతీయ స్థాయిలో కుప్పం గుర్తింపు తెచ్చుకుంది.

Updated Date - Sep 27 , 2026 | 01:19 AM