రైస్ పుల్లింగ్ కేసులో ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:05 AM
రైస్ పుల్లింగ్‌తో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిని మోసగించి రూ.50వేలు లాక్కున్న ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసినట్లు పుంగనూరు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
పుంగనూరు రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): రైస్ పుల్లింగ్‌తో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిని మోసగించి రూ.50వేలు లాక్కున్న ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసినట్లు పుంగనూరు సీఐ సుబ్బరాయుడు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చౌడేపల్లె మండలం దుర్గసముద్రం పంచాయతీ డి.రాజులూరుకు చెందిన మునిరత్నం కుమారుడు సాతుపాటి రెడ్డెప్ప(39), అతని స్నేహితుడు మునీంద్ర, పుంగనూరుకు చెందిన ఇస్మాయిల్ కుమారుడు సయ్యద్ ఆదాంబాషా కలిసి తమవద్ద మహిమగల రైస్ పుల్లింగ్ పాత్ర ఉన్నట్లు సికింద్రాబాద్‌కు చెందిన నాగప్ప కుమారుడు సూర్య వెంకటరత్నం(45)కు సమాచారం ఇచ్చారు. ఈనెల 7వ తేదీ రెడ్డెప్ప, మునీంద్ర, ఆదాంబాషాలతో పాటు బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురానికి చెందిన నాగిరెడ్డి(66), కార్వేటినగరానికి చెందిన తోట ఆరుద్రయ్య(47), వెదురుకుప్పం మండలం మారెపల్లి హరిజనవాడకు చెందిన పరంధామయ్య కుమారుడు కావలి మహేశ్(38), కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లెకు చెందిన యేసురత్నం కుమారుడు నంద్యాల సంజీవయ్య(55) కలిసి సూర్య వెంకటరత్నంను పుంగనూరు మండలం చదళ్ల వద్దకు పిలిపించారు. వారివద్ద ఉన్న ఓ రాగి పాత్ర చూపారు. పథకం ప్రకారం పాత్ర చూపగానే బియ్యం మాడిపోయినట్లు కనిపించేలా చేశారు. వీరు మోసం చేస్తున్నట్లు సూర్య వెంకటరత్నం గ్రహించారు. ఈ విషయం గమనించిన ముఠా సభ్యులు అతన్ని బెదిరించి రూ.50వేలు తీసుకున్నారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పుంగనూరు బైపాస్ రోడ్డు యూఎన్‌ఆర్ సర్కిల్ వద్ద ఉన్న నాగిరెడ్డి, ఆరుద్రయ్య, మహేశ్‌కుమార్, సయ్యద్ ఆదాంబాషా, ఎస్.రెడ్డెప్ప, సంజీవయ్యలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. వారి వద్ద రూ. 39వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పుంగనూరు కోర్టులో న్యాయమూర్తి వద్ద హాజరుపరచగా నిందితులకు 14రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశించారు. కేసులో మరో నిందితుడు మునీంద్ర పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐలు కేవీ.రమణ, అన్సర్‌బాషా పాల్గొన్నారు.