Share News

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురి అరెస్ట్‌

ABN , Publish Date - Apr 19 , 2026 | 01:49 AM

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ పరశురాముడు తెలిపారు.

క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురి అరెస్ట్‌

బైరెడ్డిపల్లె, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు రూరల్‌ సీఐ పరశురాముడు తెలిపారు. ఆయన కథనం మేరకు.. బైరెడ్డిపల్లె-వి.కోట ప్రధాన రహదారిలో కైగల్‌క్రాస్‌ వద్ద శుక్రవారం రాత్రి క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్‌ఐ చందనప్రియ, తమ సిబ్బందితో కలసి దాడి చేశారు. సాగర్‌, హరీష్‌, దినే్‌షకుమార్‌, సాధిక్‌బేగ్‌, వంశీ, నందకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, కర్ణాటక హొస్కోటకు చెందిన సాగర్‌ గడ్డూరుకు చెందిన హరీష్‌ ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు తేలింది. బెట్టింగ్‌పై అసక్తి ఉన్న వ్యక్తులను తీసుకొస్తే కమీషన్‌ ఇచ్చేలా హరీ్‌షతో సాగర్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈక్రమంలో హరీష్‌ బైరెడ్డిపల్లె మండలంలో కొందరిని సాగర్‌ తయారుచేసిన బెట్టింగ్‌ లింకుల ద్వారా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాడు. ఎస్పీ తుషార్‌డూడి ఆదేశాలమేరకు డీఎస్పీ డేగల ప్రభాకర్‌ ఆధ్వర్యంలో దాడి నిర్వహించినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. వారి నుంచి మొబైల్‌ఫోన్లు, రూ.40వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆయన యువతకు సూచించారు.

Updated Date - Apr 19 , 2026 | 01:49 AM