చెల్లెలిని కాపాడబోయి అక్క చెరువులో పడి ఇద్దరూ మృతి
ABN , Publish Date - Apr 20 , 2026 | 01:50 AM
ప్రమాదవశాత్తు చెరువులోని పెద్ద గుంతలో జారిపడిన చెల్లెలిని కాపాడేందుకు అక్క ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లిద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లెలోని మహేష్ భార్య బేబీ(20), అగరం పంచాయతీ ఎ.కొత్తపల్లెకు చెందిన వేణుగోపాల్ భార్య దుర్గ(27) అక్కా చెల్లెళ్లు. అదివారం దుర్గ చెల్లెలు బేబి ఇంటికి వచ్చారు.
చెల్లెలిని కాపాడబోయి అక్క
చెరువులో పడి ఇద్దరూ మృతి
దుస్తులు ఉతికే క్రమంలో విషాదం
గుడుపల్లె, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు చెరువులోని పెద్ద గుంతలో జారిపడిన చెల్లెలిని కాపాడేందుకు అక్క ప్రయత్నించింది. ఈ క్రమంలో అక్కాచెల్లెళ్లిద్దరూ నీట మునిగి మృతిచెందారు. స్థానికులు తెలిపిన ప్రకారం.. గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లెలోని మహేష్ భార్య బేబీ(20), అగరం పంచాయతీ ఎ.కొత్తపల్లెకు చెందిన వేణుగోపాల్ భార్య దుర్గ(27) అక్కా చెల్లెళ్లు. అదివారం దుర్గ చెల్లెలు బేబి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వారిద్దరూ భోజనం చేశాక బట్టలు ఉతకడానికి సమీపంలోని కుప్పయ్య చెరువుకు వెళ్లారు. చెరువులోని బండపై బేబీ బట్టలు ఉతుకుతుండగా.. దుర్గ కాస్త దూరంలో ఉంది. ఆ సమయంలో బేబీ కాలు జారి చెరువులో పడిపోయింది. ఈమె కేకలతో గమనించిన దుర్గ.. బేబీని కాపాడేందుకు తానూ దిగింది. ఇద్దరూ పెద్ద గుంతలో పడి మునిగిపోయారు. అక్కడకు కొద్ది దూరంలో ఉన్న స్థానికులు వీరిని గమనించి.. ఘటనా స్థలానికి పరుగు తీశారు. చెరువులో గాలించి బయటకు తీశారు. అప్పటికే బేబీ, దుర్గ ప్రాణాలు కోల్పోయారని నిర్ధారించారు. కుటుంబ సభ్యులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాల వద్ద బోరున విలపించారు. దుర్గకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అక్కాచెల్లెళ్ల మృతితో కొత్తపల్లె, కనమనపల్లెల్లో గ్రామాల్లో విషాధచాయలు అలుముకొన్నాయి. దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు.