సిజ్జు.. రూ.5 లక్షలు
ABN , Publish Date - May 08 , 2026 | 01:28 AM
చూడ్డానికి టెడ్డీబేర్‌లా ఉంది. కానీ, ఇది సిజ్జు బ్రీడ్‌కు చెందిన కుక్క పిల్ల. వయసు 5 నెలలు. దీని ధర అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. డాగ్ లవర్‌గా పేరొందిన చిత్తూరు నగరం సంతపేటకు చెందిన గోపి దీనిని గురువారం తీసుకొచ్చారు. ఈయనకు కుక్కలంటే అమితమైన ప్రేమ. 30 ఏళ్లుగా రకరకాల కుక్కలను పెంచుతున్నారు. ఇప్పుడు ఇంటి వద్ద 50 కుక్కలతో ఓ హాస్టల్‌ను నడుపుతున్నారు.
చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి : చూడ్డానికి టెడ్డీబేర్‌లా ఉంది. కానీ, ఇది సిజ్జు బ్రీడ్‌కు చెందిన కుక్క పిల్ల. వయసు 5 నెలలు. దీని ధర అక్షరాలా ఐదు లక్షల రూపాయలు. డాగ్ లవర్‌గా పేరొందిన చిత్తూరు నగరం సంతపేటకు చెందిన గోపి దీనిని గురువారం తీసుకొచ్చారు. ఈయనకు కుక్కలంటే అమితమైన ప్రేమ. 30 ఏళ్లుగా రకరకాల కుక్కలను పెంచుతున్నారు. ఇప్పుడు ఇంటి వద్ద 50 కుక్కలతో ఓ హాస్టల్‌ను నడుపుతున్నారు. ఇక, వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన కొత్తరకం బ్రీడ్‌లను తీసుకొచ్చి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో 2020 నుంచి సిజ్జూ బ్రీడ్ కోసం ఆన్‌లైన్‌లో విస్తృతంగా శోధించారు. రష్యా దేశానికి చెందిన మగ జాతి షాడో, థాయ్‌లాండ్‌కు చెందిన లైలా(ఆడ)కు అక్కడే సిజ్జూ పుట్టింది. ఐదు నెలల సిజ్జూను థాయ్‌లాండ్ నుంచి విమానం ద్వారా నాలుగు రోజుల కిందటే హైదరాబాదుకు తీసుకొచ్చారు. హైదరాబాదులోని చింటూరెడ్డి ద్వారా గోపికి సమాచారం తెలిసింది. ఆయన హైదరాబాదు వెళ్లి రూ.5 లక్షలు చెల్లించి ప్రత్యేక వాహనంలో సిజ్జును చిత్తూరుకు తీసుకొచ్చారు. సిజ్జుకు హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్లడం గమనార్హం. ఈ బ్రీడ్ రకం కుక్క పిల్లను 24 గంటలూ ఏసీలో ఉంచాలి. రాయల్‌కేనన్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. కాగా, నగరంలోని పలువురు సిజ్జును ఆసక్తిగా చూసి వెళుతున్నారు.