గంజాయి మత్తులో ఎస్‌ఐపై దాడి
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:48 AM
గంజాయి మత్తులో ఇద్దరు వ్యక్తులు ఎస్‌ఐ విష్ణు నారాయణపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. హర్యానా రాష్ట్రానికి చెందిన రితేశ్వర్ సింగ్, రామేశ్వర్ సింగ్ సదుం గాంధీ రోడ్డులోని ఓ ఇంటిలో ఉంటూ క్వారీ నిర్వహిస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు
సదుం, జూన్ 27(ఆంధ్రజ్యోతి): గంజాయి మత్తులో ఇద్దరు వ్యక్తులు ఎస్‌ఐ విష్ణు నారాయణపై దాడికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. హర్యానా రాష్ట్రానికి చెందిన రితేశ్వర్ సింగ్, రామేశ్వర్ సింగ్ సదుం గాంధీ రోడ్డులోని ఓ ఇంటిలో ఉంటూ క్వారీ నిర్వహిస్తున్నారు. వీరు తరచూ గంజాయి తాగుతున్నారు. ఈ సమాచారంతో శనివారం రాత్రి ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వెళ్లగా అప్పటికే ఇంట్లో వారిద్దరూ గంజాయి మత్తులో ఉన్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐపై తిరగబడి దాడికి పాల్పడ్డారు. ఎస్‌ఐ గాయపడ్డారు. పోలీసులు వెంటనే వారిద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.