Share News

మామిడి మండీల్లో కొనుగోళ్ల సందడి

ABN , Publish Date - May 07 , 2026 | 01:22 AM

మండల కేంద్రంలో మామిడి మండీల ఏర్పాటుతో రైతన్నలు ఉత్సాహంగా కోతలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది తోతాపురి కిలో రూ.5 వరకు పలకడంతో నిరుత్సాహపడ్డారు.

మామిడి మండీల్లో కొనుగోళ్ల సందడి
తోతాపురి కాయలు

ఆశాజనకంగా ధరలు

సోమల, మే 6 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో మామిడి మండీల ఏర్పాటుతో రైతన్నలు ఉత్సాహంగా కోతలకు శ్రీకారం చుట్టారు. గత ఏడాది తోతాపురి కిలో రూ.5 వరకు పలకడంతో నిరుత్సాహపడ్డారు. బేనిషా రకం రూ.22 నుంచి రూ.30లోపు పలికింది. మల్లికా రకం రూ.30 లోపు పలికింది. బుధవారం మండీలో బేనిషా రకం రూ. 43, తోతాపురి రూ.15 నుంచి రూ.25, ఖాదర్‌ రకం రూ.25 నుంచి రూ.40, మల్లికా రకం రూ.30 నుంచి రూ.45, పుల్లూర రకం రూ.15 నుంచి రూ.25 ధరలు పలికాయి. ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు కోతలకు సిద్ధమయ్యారు. మండీలకు వచ్చిన కాయలను న్యూఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ వ్యాపారస్తులు కొనుగోలు చేస్తున్నారు. మరోపక్క ఎగుమతులకు శ్రీకారం చుట్టారు.

Updated Date - May 07 , 2026 | 01:22 AM