10 నుంచి శెట్టిపల్లె భూముల రిజిస్ర్టేషన్లు
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:01 AM
తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె భూముల రిజిస్ర్టేషన్లను ఈ నెల 10 నుంచి చేపడుతున్నట్లు తుడా వీసీ గోవిందరావు తెలిపారు.తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, రేణిగుంట సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు రిజిస్ర్టేషన్‌కు సంబంధించిన ఆధారాలు, పత్రాలు తీసుకెళ్ళి రిజిస్ర్టేషను చేసుకునేలా చూడాలని తుడా అధికారులను ఆయన ఆదేశించారు.
తిరుపతి సెంట్రల్/కలెక్టరేట్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి) : తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లె భూముల రిజిస్ర్టేషన్లను ఈ నెల 10 నుంచి చేపడుతున్నట్లు తుడా వీసీ గోవిందరావు తెలిపారు.తిరుపతి రూరల్, తిరుపతి అర్బన్, రేణిగుంట సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయాల వద్ద లబ్ధిదారులు రిజిస్ర్టేషన్‌కు సంబంధించిన ఆధారాలు, పత్రాలు తీసుకెళ్ళి రిజిస్ర్టేషను చేసుకునేలా చూడాలని తుడా అధికారులను ఆయన ఆదేశించారు.తుడా కార్యాలయంలో బుధవారం కార్యదర్శి శ్రీకాంత్‌బాబు, సీపీవో దేవీకుమారి తదితరులతో ఆయన సమావేశం నిర్వహించారు.కాగా లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ తేదీ, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను 24గంటల ముందుగానే తమ సిబ్బంది తెలియజేస్తారని కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. దాదాపు పది రోజుల పాటు ఈ ప్రక్రియ ఉంటుందన్నారు. లబ్ధిదారుడు రిజిస్ట్రేషన్‌కు అధార్‌కార్డు, పాన్‌కార్డు, భూమిపత్రాలతో పాటు యూజర్ ఛార్జిలు ఎస్‌బీఐ ద్వారా చెల్లించిన చలానా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సందేహాలుంటే 9182698526(సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, జూనియర్ అసిస్టెంట్, 7989638264(ఎఫ్‌ఎం ఇంజనీర్)ను సంప్రదించవచ్చని తెలిపారు. యూజర్ ఛార్జీలు మినహాయించి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.