పిడుగు పడి గొర్రెల కాపరి దుర్మరణం
ABN , Publish Date - May 07 , 2026 | 01:36 AM
మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సంచి సిద్ధార్ధన(48) బుధవారం పిడుగు పడి దుర్మరణం చెందాడు.
పెళ్ళకూరు, మే 6(ఆంధ్రజ్యోతి) : మండలంలోని శిరసనంబేడు గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సంచి సిద్ధార్ధన(48) బుధవారం పిడుగు పడి దుర్మరణం చెందాడు. స్థానికుల సమాచారం మేరకు... ఉదయం రోజూలాగే గొర్రెలను మేపేందుకు గ్రామ సమీపంలో ఉన్న పొలాల వద్దకు సిద్ధార్థన వెళ్లాడు. మధ్యాహ్నం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయి మృతి చెందాడు. అదే సమయంలో సిద్ధార్ధనతో పాటు మరో నలుగురు గొర్రెల కాపరులు కొంత దూరంలో ఉండగా మెరుపుల తాకిడికి సెల్‌లు స్విచ్ ఆప్ చేశారు. సిద్ధార్థన మాత్రం సెల్ స్విచ్ ఆప్ చేయకపోవడంతో పిడుగు పడిన వెంటనే షాక్‌కు గురై జేబులో ఉన్న సెల్ పేలిపోయి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.