Share News

భర్తను చంపి.. చెట్టుకు ఉరేసింది

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:05 AM

భర్తను ప్రియుడితో కలిసి చంపేసి.. చెట్టుకు ఉరేసింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. దర్యాప్తులో నిజం బయటపడటంతో నిందితులిద్దరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.

భర్తను చంపి.. చెట్టుకు ఉరేసింది
అరెస్టు చేసిన నిందితులతో పోలీసులు

ప్రియుడితో కలిసి ఘాతుకం

ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు

కుప్పం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): భర్తను ప్రియుడితో కలిసి చంపేసి.. చెట్టుకు ఉరేసింది. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. దర్యాప్తులో నిజం బయటపడటంతో నిందితులిద్దరినీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. అర్బన్‌ సీఐ శంకరయ్య తెలిపిన వివరాల మేరకు.. కుప్పం మండలం మోట్లచేను గ్రామంలో భూపతి, గీత దంపతులు నివసిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రం తిమ్మన్‌ పొన్నుకన్‌ అలియాస్‌ మసితిమ్మతో గీత వివాహేతర సంబంధం పెట్టుకుంది. తర్వాత భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది. కాపురం ఉన్న గుడిసెలోనే మార్చి 22వ తేదీ రాత్రి భర్తని ప్రియుడితో కలిసి చంపి, మృతదేహాన్ని మామిడి చెట్టుకు ఉరేసి ఆత్మహత్యగా చిత్రించడానికి ప్రయత్నించారు. పోలీసులు సైతం గీత ఫిర్యాదుతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే గీత, మసితిమ్మలే భూపతిని చంపినట్లు తేలడంతో నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Updated Date - Apr 05 , 2026 | 01:05 AM