జెట్టివారిపల్లెలో విషాదఛాయలు
ABN , Publish Date - Aug 10 , 2026 | 01:54 AM
అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తమ గ్రామవాసి మృతి చెందాడని తెలియడంతో చిట్వేలి మండల పరిధిలోని జెట్టివారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో బిడ్డ మృతితో శోకసంద్రంలో తల్లిదండ్రులు
మరో ఐదు రోజుల్లో మన దేశానికి మృతదేహం
చిట్వేలి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో తమ గ్రామవాసి మృతి చెందాడని తెలియడంతో చిట్వేలి మండల పరిధిలోని జెట్టివారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన బుంగటావుల శ్రీహరి, చాముండి దంపతుల కుమారుడు పెద్దకొడుకు దిలీ్‌పకుమార్(26)ను మూడేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా పంపారు. కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఇతడు, ఐదు నెలల కిందట సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం 7.15 గంటలకు స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దించి వస్తుండగా.. మెస్‌డోనియా ఓహెచ్ ప్రాంతంలో ఎదురుగా వేగంగా వచ్చిన పికప్ ట్రక్ దిలీప్ ప్రయాణిస్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో అతను మృతి చెందాడన్న సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో ముగినిపోయారు. శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావడంతో దిలీ్‌పకుమార్ మృతదేహం రావడానికి మరో ఐదు రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు.