Share News

బాలికపై లైంగిక దాడి

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:26 AM

పుంగనూరు మండలంలో ఓ తండా వద్ద శనివారం ఓ బాలికపై వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పుంగనూరు ఎస్సై అన్సర్‌ బాషా కథనం మేరకు..

బాలికపై లైంగిక దాడి

పుంగనూరు, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): పుంగనూరు మండలంలో ఓ తండా వద్ద శనివారం ఓ బాలికపై వరసకు పెదనాన్న అయ్యే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పుంగనూరు ఎస్సై అన్సర్‌ బాషా కథనం మేరకు.. 13 ఏళ్ల బాలిక రేషన్‌ తెచ్చుకోవడానికి గ్రామం నుంచి సమీపంలోని తండాకు వెళుతుండగా రాంబాబు నాయక్‌ (36) ఆటో ఆపి తాను తీసుకెళ్తానని ఆటోలో కూర్చోబెట్టుకున్నాడు. సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఆపి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలి తల్లి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Updated Date - Apr 05 , 2026 | 01:26 AM