Share News

ఏడుగురు ఎస్‌ఐల బదిలీ

ABN , Publish Date - Apr 05 , 2026 | 01:16 AM

జిల్లాలో ఏడుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

ఏడుగురు ఎస్‌ఐల బదిలీ

తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏడుగురు ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ సుబ్బరాయుడు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే కొత్త స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. తిరుపతి వెస్ట్‌ పోలీ్‌సస్టేషన్లో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎం.వి.అనిల్‌కుమార్‌ను సీసీఎ్‌సకు బదిలీ చేశారు. గాజులమండ్యంలో పనిచేస్తున్న ఎస్‌ఐ ఎస్‌.నాగార్జునను తిరుపతి వీఆర్‌కు, తిరుపతి వెస్ట్‌లో పనిచేస్తున్న మహిళా ప్రొబేషనరీ ఎస్‌ఐ ఎస్‌.హరీషను గాజులమండ్యానికి బదిలీ చేశారు. పుత్తూరులో పనిచేస్తున్న ఎస్‌ఐ వి.అశోక్‌ను తిరుపతి వీఆర్‌కు, తిరుపతి వీఆర్‌లో ఉన్న ఎస్‌ఐ ఎస్‌.నాగేంద్రబాబును పుత్తూరుకు బదిలీ చేశారు. తిరుపతి వీఆర్‌లో ఉన్న ఆర్‌పీ ఎ్‌సఐ పి.సుమతి తిరుచానూరుకు బదిలీ అయ్యారు. తిరుపతి ఈస్ట్‌ ఎస్‌ఐ ఎస్‌.జి.హేమాద్రిని తిరుపతి వెస్ట్‌కు బదిలీ చేశారు.

Updated Date - Apr 05 , 2026 | 01:16 AM