సీపీఎంకు సీనియర్ నేతల రాజీనామా
ABN , Publish Date - May 12 , 2026 | 02:08 AM
సత్యవేడు నియోజకవర్గంలో సీపీఎంకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సత్యవేడు మాజీ మండల కార్యదర్శి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణాచలం, నాగలాపురం మండల కార్యదర్శి మురుగేష్, నాయకులు ధనమణి, మురుగన్, దక్షిణామూర్తి, పయణియమ్మ పార్టీకి రాజీనామా చేశారు.
సత్యవేడు, మే 11(ఆంధ్రజ్యోతి): సత్యవేడు నియోజకవర్గంలో సీపీఎంకు ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సత్యవేడు మాజీ మండల కార్యదర్శి, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అరుణాచలం, నాగలాపురం మండల కార్యదర్శి మురుగేష్, నాయకులు ధనమణి, మురుగన్, దక్షిణామూర్తి, పయణియమ్మ పార్టీకి రాజీనామా చేశారు.ఈ సందర్భంగా మీడియాతో అరుణాచలం మాట్లాడుతూ పార్టీలో స్థానిక నాయకత్వం సిద్ధాంతాలను విస్మరించి సొంత అజెండాతో పనిచేస్తోందని ఆరోపించారు.ఈ విషయాన్ని జిల్లా నాయకత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హోల్ టైమర్లకే ప్రాధాన్యతనిస్తూ సీనియర్లను పూర్తిగా పక్కన పెడుతున్నారని వాపోయారు.రాజీనామా లేఖను సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజుకు వాట్సాప్ ద్వారా పంపించామని వెల్లడించారు.2006లో సీపీఎంలో చేరిన అరుణాచలం సత్యవేడు ప్రాంతంలో చాలా కార్మిక, కర్షక, సామాజిక, భూ ఉద్యమాలను ముందుండి నడిపించారు.