Share News

25 ఇసుక ట్రాక్టర్ల నిర్బంధం

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:58 AM

తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 25 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని నిర్బంధించారు. స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక రవాణా చేస్తున్నారు. శ

25 ఇసుక ట్రాక్టర్ల నిర్బంధం
పూడి ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఇసుక ట్రాక్టర్లు

శ్రీకాళహస్తి రూరల్‌, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 25 ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకుని నిర్బంధించారు. స్వర్ణముఖి నది నుంచి నిత్యం ఇసుక రవాణా చేస్తున్నారు. శనివారం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి పొలాల్లో ఇసుక ట్రాక్టర్‌ బోల్తా పడింది. చిన్న గాయాలతో డ్రైవర్‌ బయటపడ్డాడు. ఆగ్రహించిన గ్రామస్తులు అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్లను ఆపారు. ఇసుక తరలింపునకు పర్మిషన్‌ లెటర్‌ చూపాలని నిలదీశారు. సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మొత్తం 25 ట్రాక్టర్లను అడ్డుకుని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో పెట్టించారు. విచారించి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను, పోలీసులను కోరారు.మైన్స్‌ ఏడీకి సమాచారం ఇచ్చినట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు.

Updated Date - Jun 14 , 2026 | 01:58 AM