పరిశ్రమల స్థాపనలో ఎస్సీ, ఎస్టీ యువతకు ప్రాధాన్యం
ABN , Publish Date - May 28 , 2026 | 01:32 AM
పరిశ్రమల స్థాపనలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ వెల్లడించారు. ఎ
చిత్తూరు కలెక్టరేట్, మే 27(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల స్థాపనలో ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో బుధవారం జరిగిన జిల్లా పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మారుమూల గ్రామాలలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలను తెలియజేయాలన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని గుర్తుచేశారు. నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు నియోజకవర్గాలలో పరిశ్రమల స్థాపనకోసం త్వరలో భూసేకరణ చేపడుతున్నట్లు వివరించారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే యువత, మహిళ, చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, తొలిసారిగా ఫ్యాక్టరీలు పెట్టడానికి వచ్చేవారికి అధిక అవకాశం కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం సూరిబాబు, జెడ్‌ఎం సుబ్బారావు, ఎల్‌డీఎం హరీష్, స్కిల్ డెవల్‌పమెంట్ ఆఫీసర్ గుణభూషన్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, భూ గర ్భగనులశాఖ అధికారి గోవర్థన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ చాంబర్ నేషనల్ చైర్మన్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.