Share News

ఎస్సీ,ఎస్టీ కేసులు తక్కువే

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:02 AM

SC Commission Chairman KS Jawahar believes that the district administration is working effectively in resolving SC and ST issues. He spoke to the media after reviewing with

ఎస్సీ,ఎస్టీ కేసులు తక్కువే
జవహర్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌,ఎస్పీ

-యంత్రాంగం బాగా పని చేస్తోందన్న జవహర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తోందని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కేఎస్‌ జవహర్‌ అభిప్రాయపడ్డారు. కలెక్టరేట్‌లో గురువారం షెడ్యూల్‌ కులాలకు సంబంధించిన సమస్యలపై అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.జిల్లాలో అట్రాసిటీ కేసులు తక్కువగా ఉన్నాయని, ఎస్సీ ఉద్యోగుల సర్వీస్‌ మేటర్స్‌ విషయంలో 15మందే ఫిర్యాదు చేశారని చెప్పారు. ముఖ్యంగా పశుసంవర్థక, విద్య, వైద్య ఆరోగ్యశాఖల్లో అధికారుల అలసత్వం ఉందని 15 శాతం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆదేశించామన్నారు.ముద్ర రుణాలు, సంక్షేమ పథకాల గురించి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అవగాహన కల్పించి వారు ఆర్ధికంగా ఎదగడానికి కృషి చేయాలన్నారు.రెండు నెలల్లో తిరిగి జిల్లాలో పర్యటిస్తామని, పెండింగ్‌ కేసులు పరిష్కరించగలిగితే సంతోషిస్తామన్నారు. కొద్దిపాటి భూవివాదాలు, ఆర్ధిక సమస్యలున్నప్పటికీ దాడులు, ప్రతిదారులు తగ్గుముఖం పట్టినట్లు పేర్కొన్నారు.అంతకుముందు ఎస్సీ వర్గాల నుంచి అర్జీలు స్వీకరించడంతో పాటు వివిధ శాఖల అఽధికారులతో దళితులపై ఆఘాయిత్యాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు.భూవివాద కేసుల్లో కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలను కిందిస్థాయిలో సరిగా అమలు చేయడం లేదని తెలిపారు.కమిషన్‌ నుంచి పంపిన ఫిర్యాదులు ఉన్నతాధికారులకు చేరకముందే కిందిస్థాయిలో పరిశీలించి పంపుతున్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఎదురవుతోందన్నారు. సరైన విధానాలు పాటించకుండా తప్పుడు కేసులుగా నిర్ధారిస్తున్నారని ఇది సరైన పద్ధతికాదని స్పష్టం చేశారు.కులవివక్ష పట్టణ ప్రాంతాల్లో తగ్గినా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతోందని, ఈ పరిస్థితులను మార్చాల్సిన బాధ్యత పోలీసు, రెవెన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. ఎస్సీ కమిషన్‌ సెక్రటరీ చిన్నరాముడు మాట్లాడుతూ ల్యాండ్‌ అండ్‌ ఫైనాన్స్‌ , అట్రాసిటీ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.కలెక్టర్‌ వెంకటేశ్వర్‌,ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఎస్సీ కమిషన్‌ పీజీఆర్‌ఎ్‌సకు 105 అర్జీలు అందాయని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు.ఎస్సీ కమిషన్‌ సభ్యులు శ్రీపతిబాబు, బిక్షం, రామాంజనేయమ్మ ,జేసీ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, టీడీపీ నేతలు కుమారమ్మ, పరసారత్నం, ఆర్డీవోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 01:02 AM