సత్యవేడు, వరదయ్యపాళ్యంలో 43.4 డిగ్రీలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:34 AM
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికితోడు వడగాల్పుల తీవ్రతకు రాత్రి ఏడు గంటలైనా జనం ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు.
తిరుపతి(కలెక్టరేట్), ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీనికితోడు వడగాల్పుల తీవ్రతకు రాత్రి ఏడు గంటలైనా జనం ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. గురువారం సత్యవేడు, వరదయ్యపాళెం మండలాల్లో అత్యధికంగా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మండలాల వారీగా.. పెనగలూరులో 43.3, వెంకటగిరిలో 41.6, తిరుపతి రూరల్, కోడూరు, చిట్వేల్, ఓబులాయపల్లిలో 41.1, పుల్లంపేటలో 40.6, ఏర్పేడు, శ్రీకాళహస్తిలో 40.4, తొట్టంబేడులో 40.1, డీవీ సత్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలో దాదాపు సగం మండలాల్లో 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.