ధనలక్ష్మిగా సత్యగంగమ్మ
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:29 AM
వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పలమనేరు పాతపేటలో సత్యగంగమ్మను శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త శెట్టోళ్ల సుబ్రహ్మణ్యం శెట్టి మనుమరాలు మీనాక్షి సుమారు రూ.2.5 లక్షల విలువైన నగదునోట్లను ఈ విశేష అలంకరణకు సమకూర్చారు.
వరలక్ష్మీ వ్రతం సందర్బంగా పలమనేరు పాతపేటలో సత్యగంగమ్మను శుక్రవారం కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఆలయ ధర్మకర్త శెట్టోళ్ల సుబ్రహ్మణ్యం శెట్టి మనుమరాలు మీనాక్షి సుమారు రూ.2.5 లక్షల విలువైన నగదునోట్లను ఈ విశేష అలంకరణకు సమకూర్చారు. ఈ సిరుల తల్లిని దర్శించేందుకు భక్తులు ఎగబడ్డారు. భక్తులకు మీనాక్షి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. సమీపాన ఉన్న పోలీసుస్టేషన్ పోలీసులు దర్శించున్నారు.
- పలమనేరు,ఆంధ్రజ్యోతి