Share News

‘సర్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Aug 12 , 2026 | 02:13 AM

ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు, అదనపు ఏఈఆర్వోలకు సాంకేతిక శిక్షణ నిర్వహించారు.

‘సర్‌’ను పకడ్బందీగా నిర్వహించాలి
ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సర్‌ ప్రక్రియను సమీక్షిస్తున్న డీఆర్వో

చిత్తూరు కలెక్టరేట్‌, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు జారీ చేసే నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలన, పరిష్కార ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో కె.మోహన్‌కుమార్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలకు, అదనపు ఏఈఆర్వోలకు సాంకేతిక శిక్షణ నిర్వహించారు. నోటీసుల తయారీ, పంపిణీ, విచారణ తేదీల నిర్ణయం, పరిష్కారంపై అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లాలో నో మ్యాపింగ్‌ కేటగిరీలో 23,881 మంది, మ్యాపింగ్‌లో లాజికల్‌ వ్యత్యాసాలున్న కేటగిరీలో 1,10,429 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రతి దశను జాగ్రత్తగా నిర్వహిస్తూ, అర్హులైన ఓటర్ల హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్‌ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, పలమనేరు, కుప్పం ఆర్డీవోలు, తహసీల్దార్లు, అన్ని మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 02:13 AM