విద్యార్థులతో సంక్రాంతి చిత్రం
ABN , Publish Date - Jan 14 , 2026 | 02:06 AM
కుప్పం చిత్రకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్న చిత్ర రీతులతో చూపరులను, కళా రసజ్ఞులను ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి పర్వాన్ని పురస్కరించుకుని ఆయన వినూత్న ప్రయోగం చేశారు.
కుప్పం, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): కుప్పం చిత్రకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం వినూత్న చిత్ర రీతులతో చూపరులను, కళా రసజ్ఞులను ఆకట్టుకుంటున్నారు. సంక్రాంతి పర్వాన్ని పురస్కరించుకుని ఆయన వినూత్న ప్రయోగం చేశారు. శాంతిపురం మండలం తుమ్మిశిలోని నోబుల్ పాఠశాలలో మంగళవారం 1200 మంది విద్యార్థులతో సంక్రాంతిని ప్రతిబింబించే చిత్రానికి రూపం కల్పించారు. పాలు పొంగుతున్న మట్టిపాత్ర, ఎద్దులు, కొబ్బరి చెట్లతోపాటు ‘హ్యాపీ పొంగల్’ అనే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్న అక్షరాలను సైతం, ఆయా రంగుల బట్టలు ధరించిన విద్యార్థులతో సృష్టించి చూపరులను ఔరా అనిపించారు. ప్రస్తుతం ఈ మానవ సంక్రాంతి చిత్రం నియోజకవర్గంలో వైరల్‌గా మారింది.