Share News

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలి: సీఐటీయూ

ABN , Publish Date - Aug 01 , 2026 | 01:57 AM

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు, స్కీమ్‌ వర్కర్లకు, ఆశాలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆశా, అంగన్‌వాడీ, స్కీమ్‌ వర్కర్లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలి: సీఐటీయూ
కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగిన ఆశాలు, అంగన్‌వాడీలు, స్కీమ్‌ వర్కర్లు

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 31(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు, స్కీమ్‌ వర్కర్లకు, ఆశాలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి డిమాండ్‌ చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఆశా, అంగన్‌వాడీ, స్కీమ్‌ వర్కర్లు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీతాలు పెంచకుంటే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరించారు. వర్కర్లపై రాజకీయ వేధింపులు పెరిగిపోయాయని చెప్పారు. ఇకనైనా కనీస వేతనం పెంచకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని దిగ్బంధనం చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందుభారీఎత్తున కార్మికులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. అనంతరం కలెక్టర్‌ వెంకటేశ్వర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నేతలు వందవాసి నాగరాజు, జయచంద్ర, సుబ్రహ్మణ్యం, వాణిశ్రీ, బాలసుబ్రహ్మణ్యం, బుజ్జి, పద్మలీల, రాజేశ్వరి, వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 01:57 AM