Share News

కేజీబీవీల్లో భద్రత ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:22 AM

చిత్తూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ సూచించారు. శనివారం స్థానిక డీఈవో కార్యాలయంలోని ఏపీసీ చాంబర్‌లో జిల్లాలోని కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

కేజీబీవీల్లో భద్రత ప్రమాణాలు పాటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏపీసీ వెంకటరమణ

చిత్తూరు సెంట్రల్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ సూచించారు. శనివారం స్థానిక డీఈవో కార్యాలయంలోని ఏపీసీ చాంబర్‌లో జిల్లాలోని కేజీబీవీల ప్రిన్సిపాళ్లతో పలు అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థినులు చదువుతున్న కేజీబీవీల్లో భద్రత ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కేజీబీవీల్లో జరుగుతున్న సివిల్‌ వర్క్‌లు, మౌలిక వసతులు, అభివృద్ధి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థినులకు వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. నిర్వహణలో నాణ్యత ప్రమాణాలు మరింత పెంచాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయాలని, విద్యార్థినుల్లో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు నైపుణ్యాలు మెరుగుపర్చాలన్నారు. ఈ ఏడాది మరింత సమర్థవంతమైన బోధన చేయడంతో పాటు ప్రతి సబ్జెక్టులోనూ విద్యార్థినులు ఉత్తమ మార్కులతో రాణించేలా చూడాలని సూచించారు. అనంతరం విలువలతో కూడిన విద్య అంశంపై తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షుడు తులసీనాధం నాయుడు ముద్రించిన నీతి పద్యాల పుస్తకాలు ఆవిష్కరించి కేజీబీవీల్లోని విద్యార్థినులకు అందించారు. సమావేశంలో జీసీడీవో ఇంద్రాణి, కేజీబీవీల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.

Updated Date - Jun 14 , 2026 | 01:22 AM