అనారోగ్యంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ మృతి
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:58 AM
మదనపల్లె గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.రషీద్‌ఖాన్(55) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన చికిత్స పొందుతూ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు.
మదనపల్లె, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): మదనపల్లె గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు పి.రషీద్‌ఖాన్(55) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన చికిత్స పొందుతూ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో సోమవారం కన్నుమూశారు. అనంతపురానికి చెందిన రషీద్‌ఖాన్ 2024 జూలైలో బదిలీపై మదనపల్లెకు వచ్చారు. అప్పటికే కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు పదేళ్ల క్రితం రెండు కిడ్నీలూ పాడయ్యాయి. తర్వాత ఒక కిడ్నీ మార్పిడి చేసినట్లు తెలిసింది. పదేళ్లపాటు ఒక కిడ్నీతో జీవించిన ఆయనకు ఏడాది క్రితం తిరిగి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయి. క్రమంగా డయాలసిస్ నడుస్తోంది. పరిస్థితి విషమించడంతో వేలూరు సీఎంసీకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆయన మృతదేహానికి నివాళులర్పించిన ఉద్యోగులు, సిబ్బంది, కుటుంబానికి సంతాపం ప్రకటించారు.