Share News

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి

ABN , Publish Date - May 07 , 2026 | 01:26 AM

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాల్సిన అవసరముందని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గ్రామీణ యువతకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టించగల నేర్పు ఎంతో ఉందన్నారు.

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి
బ్యాటింగ్‌ చేసి క్రికెట్‌ పోటీలను ప్రారంభిస్తున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, మే 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు అన్ని విధాలా సహకరించి ప్రోత్సహించాల్సిన అవసరముందని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. గ్రామీణ యువతకు చేయూతనిస్తే అద్భుతాలు సృష్టించగల నేర్పు ఎంతో ఉందన్నారు. బుధవారం ప్రభుత్వ హైస్కూల్‌ మైదానంలో కలికిరి క్రికెట్‌ పోటీలను ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. గ్రామీణ యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఇలాంటి క్రీడా పోటీలు దోహదపడతాయని ఎమ్మెల్యే అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. అనంతరం కొద్దిసేపు క్రికెట్‌ పోటీలను తిలకించారు. కార్యక్రమంలో కలికిరి సింగిల్‌ విండో అధ్యక్షుడు నల్లారి చంద్రకుమార్‌ రెడ్డి, కలికిరి మాజీ సర్పంచు నల్లారి లక్ష్మీకర్‌ రెడ్డి, మారుతీ రెడ్డి, డాక్టర్‌ మహేంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2026 | 01:26 AM