Share News

16 పరిశ్రమలకు రూ.4.52కోట్ల ప్రోత్సాహకాలు

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:52 AM

కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు.

16 పరిశ్రమలకు రూ.4.52కోట్ల ప్రోత్సాహకాలు

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 4(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు, వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. సింగిల్‌డెస్క్‌ విధానంలో గత ఏడాది డిసెంబరు నుంచి 2440 పరిశ్రమలకు దరఖాస్తులు అందగా, 2,323 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామన్నారు. మరో 166 పరిశ్రమల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు. 16 పరిశ్రమలకు ప్రోత్సహకాల కింద రూ.4.52కోట్లు అందించినట్లు కలెక్టర్‌ తెలిపారు.డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజరు చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జడ్‌ఎం విజయ్‌భరత్‌రెడ్డి, శివకుమార్‌, ఫ్యాక్టరీస్‌ డిప్యూటీ చీఫ్‌ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 12:52 AM