Share News

వైసీపీ హయాంలో రూ.400 కోట్ల భూ కుంభకోణం

ABN , Publish Date - Apr 16 , 2026 | 01:51 AM

వైసీపీ హయాంలో పీలేరు మండలంలోనే రూ.400 కోట్ల మేర భూ కుంభకోణం జరిగిందని, సాంకేతిక ఆధారాలతో సహా వాటిని సేకరించామని, త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ హయాంలో రూ.400 కోట్ల భూ కుంభకోణం
అన్న క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌ రెడ్డి

పీలేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పీలేరు మండలంలోనే రూ.400 కోట్ల మేర భూ కుంభకోణం జరిగిందని, సాంకేతిక ఆధారాలతో సహా వాటిని సేకరించామని, త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పీలేరులో బుధవారం ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పీలేరు-సదుం రోడ్డులో గతంలో కొట్టుకుపోయిన బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు భూమిపూజ చేశారు. ఏఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్‌ పీలేరులోనూ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే 2019లో జగన్‌ వాటిని మూసివేయించారన్నారు. రాజధాని అమరావతిపై అక్కసుతో మావిగన్‌ అంటూ కొత్త నినాదం తెరపైకి తెచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువైన రెండేళ్లలో పీలేరు నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను పీలేరును వదిలేసి వెళ్లిపోతానని ప్రచారం చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పీలేరు-సదుం మార్గంలో నాసికరంగా నిర్మించిన బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయిందని, దాన్ని పునరుద్ధరిస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన అన్నా క్యాంటీన్‌లో ప్రజలకు భోజనం వడ్డించడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు


పీలేరు, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో పీలేరు మండలంలోనే రూ.400 కోట్ల మేర భూ కుంభకోణం జరిగిందని, సాంకేతిక ఆధారాలతో సహా వాటిని సేకరించామని, త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పీలేరులో బుధవారం ఆయన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. పీలేరు-సదుం రోడ్డులో గతంలో కొట్టుకుపోయిన బ్రిడ్జిని పునరుద్ధరించేందుకు భూమిపూజ చేశారు. ఏఎంసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పేదలకు అతి తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్‌ పీలేరులోనూ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. 2014-19 మధ్యలో చంద్రబాబు అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే 2019లో జగన్‌ వాటిని మూసివేయించారన్నారు. రాజధాని అమరావతిపై అక్కసుతో మావిగన్‌ అంటూ కొత్త నినాదం తెరపైకి తెచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువైన రెండేళ్లలో పీలేరు నియోజకవర్గంలో ప్రశాంతత నెలకొందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తాను పీలేరును వదిలేసి వెళ్లిపోతానని ప్రచారం చేస్తున్నారని, అది ఎప్పటికీ జరగదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పీలేరు-సదుం మార్గంలో నాసికరంగా నిర్మించిన బ్రిడ్జి వరదలకు కొట్టుకుపోయిందని, దాన్ని పునరుద్ధరిస్తున్నామని అన్నారు. అనంతరం ఆయన అన్నా క్యాంటీన్‌లో ప్రజలకు భోజనం వడ్డించడమే కాకుండా వారితో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 01:53 AM