గుడిమల్లం గుడికి రూ.25కోట్ల విరాళం
ABN , Publish Date - Jun 21 , 2026 | 01:30 AM
దేశంలో మొదటి శివాలయంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి భూరి విరాళం అందనుంది. రిలయన్స్ గ్రూపు కంపెనీల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్‌అంబానీ రూ.25కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు శనివారం ఆలయ చైర్మన్ గిరినాయుడు వెల్లడించారు.
అనంత్ అంబానీ ప్రకటించారన్న ఆలయ ఛైర్మన్
ఏర్పేడు, జూన్ 20(ఆంధ్రజ్యోతి): దేశంలో మొదటి శివాలయంగా పేరుగాంచిన ఏర్పేడు మండలంలోని గుడిమల్లంలో వెలసిన పరశురామేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి భూరి విరాళం అందనుంది. రిలయన్స్ గ్రూపు కంపెనీల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్‌అంబానీ రూ.25కోట్ల విరాళాన్ని అందించనున్నట్లు శనివారం ఆలయ చైర్మన్ గిరినాయుడు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం తిరుమల వెంకన్న దర్శనానికి విచ్చేసిన అనంత్ అంబానీ శ్రీకాళహస్తీశ్వరుడిని కూడా దర్శించుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో గుడిమల్లం ఆలయ అభివృద్ధికి ఆర్ధికసాయం కోరారు. స్పందించిన అనంత్ అంబానీ వెంటనే రూ.25కోట్లు విరాళం ప్రకటించినట్లు తెలిపారు. ఈ సొమ్ముతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలతో పాటు సాంస్కృతిక ఆధ్యాత్మిక వికాస కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.