ఆ అనాథల ఇంటి బాగుకు రూ.2 లక్షలు
ABN , Publish Date - Sep 19 , 2026 | 01:48 AM
తల్లిని.. అన్నను పోగొట్టుకుని, తండ్రిని దూరం చేసుకుని అనాథలైన అక్కాచెల్లెళ్లకు ఇంటి మరమ్మతులకుగాను ప్రభుత్వం రూ.రెండు లక్షలు మంజూరు చేసింది.
శాంతిపురం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): తల్లిని.. అన్నను పోగొట్టుకుని, తండ్రిని దూరం చేసుకుని అనాథలైన అక్కాచెల్లెళ్లకు ఇంటి మరమ్మతులకుగాను ప్రభుత్వం రూ.రెండు లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ మాదనపల్లెకు హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం వెళ్లి రమ్య, కావ్యలకు మంజూరు ఉత్తర్వులను చిన్నారులకు అందించారు. 15 రోజుల క్రితం ఈ పిల్లలను కడా పీడీ వికాస్ మర్మత్, ప్రజా ప్రతినిధులు, దళిత నేతలు పరామర్శించారు. సీఎం చంద్రబాబు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఇంటి మరమ్మతులు చేపడతామన్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం రూ.2లక్షలు మంజూరు చేసింది.