Share News

చిట్టీలు, వడ్డీల పేరుతో రూ.2 కోట్ల టోకరా

ABN , Publish Date - Apr 14 , 2026 | 01:50 AM

చిట్స్‌ కంపెనీలో పనిచేస్తూ జనం నుంచి సుమారు రూ.2 కోట్లకు పైగా సొమ్ము వసూలు చేసి పరారైన ఘటన సూళ్లూరుపేటలో వెలుగు చూసింది.

చిట్టీలు, వడ్డీల పేరుతో రూ.2 కోట్ల టోకరా

సూళ్లూరుపేట, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): చిట్స్‌ కంపెనీలో పనిచేస్తూ జనం నుంచి సుమారు రూ.2 కోట్లకు పైగా సొమ్ము వసూలు చేసి పరారైన ఘటన సూళ్లూరుపేటలో వెలుగు చూసింది.పట్టణానికి చెందిన పెనుబోలు పురంధర్‌ ఓ చిట్స్‌ కంపెనీలో పనిచేస్తూ జనంవద్ద నగదు కట్టిస్తూ వచ్చాడు.ఫైనాన్స్‌ నిర్వహిస్తూ తెలిసిన వారి వద్ద లక్షల రూపాయలు తీసుకుని వడ్డీకి మార్చేవాడు. చిట్‌ పూర్తయిన వారు డబ్బు అడిగితే కంపెనీ పేరుతో కాకుండా తన పేరుతో చెక్కు ఇచ్చి వడ్డీ వేసి ఇస్తానని తన వద్దే నగదు ఉంచుకునేవాడు. ఈ క్రమంలోనే తన బంధువుల వద్ద దాదాపు రూ.కోటి రూపాయలు వడ్డీపేరుతో తీసుకుని ఇవ్వనే లేదు. బంధువుల నుంచి ఒత్తిడి ఎక్కువవడంతో ఈ నెల 5న కోళ్లమిట్టలో ఇంటిని ఖాళీచేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు.బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు.

Updated Date - Apr 14 , 2026 | 01:50 AM