Share News

‘విండో’లకు రూ.1.67 కోట్ల విడుదల

ABN , Publish Date - Feb 15 , 2026 | 01:16 AM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్‌ విండో)ల్లో నిర్మాణాలు, మరమ్మతులకు రూ.1.67 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సీఈవో శంకర్‌ బాబు తెలిపారు.

‘విండో’లకు రూ.1.67 కోట్ల విడుదల

- నిర్మాణాలు, మరమ్మతుల కోసమన్న డీసీసీబీ సీఈవో శంకర్‌ బాబు

చిత్తూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (సింగిల్‌ విండో)ల్లో నిర్మాణాలు, మరమ్మతులకు రూ.1.67 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) సీఈవో శంకర్‌ బాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కలికిరిలోని ఖాళీస్థలంలో 15 గదుల నిర్మాణాలకోసం రూ.39 లక్షలు, పెనుమూరు విండో ప్రహరీ నిర్మాణానికి రూ.25లక్షలు, తంగెళ్లపాళెం విండో ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్‌ బంకు పరిసరాల్లో ప్రహరీ నిర్మాణానికి రూ.21 లక్షలు, కాపుగన్నేరిలోని ఖాళీ స్థలం దురాక్రమణకు గురికాకుండా గోదాము నిర్మాణానికి రూ.20 లక్షలు విడుదల చేశామన్నారు. అలాగే తంగెళ్లపాళెంలో పెట్రోల్‌ బంకు వద్ద అదనపు నిర్మాణానికి రూ.14లక్షలు, వాయల్పాడులో విండో భవన పునఃనిర్మాణానికి, కౌంటర్లు, ఫ్లోరింగ్‌, ఫర్నిచర్‌, పెయింటింగ్‌ కోసం రూ.10లక్షలు, కోసలనగరంలో ప్రహరీ, మరుగుదొడ్డి నిర్మాణం, మోటారు, పైప్‌లైన్‌ విస్తరణకు రూ.9లక్షలు, శ్రీరంగరాజపురం విండో పరిధిలో నూతనంగా మరుగుదొడ్డి, జీఐ రూఫ్‌షీట్స్‌, పెయింటింగ్‌ పనులకు రూ.13.50 లక్షలు, పలమనేరులో విండో భవన మరమ్మతులకు రూ.5.90 లక్షలు, బి.కొత్తకోటలో కౌంటర్ల ఏర్పాటుకు రూ.3లక్షలు, గంగాధరనెల్లూరులో భవన నిర్మాణానికి రూ.5లక్షలు, సోంపల్లెలో విండో భవనం, గోదాము మరమ్మతులకు రూ.3 లక్షలు విడుదల చేశామని వివరించారు. ఆయా సింగిల్‌ విండోలకు రుణం రూపేణ విడుదల చేసిన మొత్తాలకు 12శాతం బదులు 11 శాతంతో వడ్డీతో 36 నెలల్లో బకాయిలను డీసీసీబీకి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర సింగిల్‌ విండో పీఏసీ కమిటీలు సైతం రుణాలకోసం ప్రతిపాదనలు ఇస్తే, వాటికి కూడా నిధులు కేటాయిస్తామని తెలిపారు.

Updated Date - Feb 15 , 2026 | 01:16 AM