Share News

ట్రాక్టర్ల బారులు

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:30 AM

గంగాధరనెల్లూరు మండలంలోని జైన్‌ ఫాంఫ్రెష్‌ ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడికాయల లోడ్లతో ట్రాక్టర్ల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది నియోజకవర్గవ్యాప్తంగా రైతులు 100 గొల్లపల్లె గల జైన్‌ఫ్యాక్టరీకి, తూగుండ్రం దారిలోని జైన్‌ఫ్యాక్టరీకి పది రోజులుగా తోతాపురి మామిడికాయలను తీసుకొస్తున్నారు.

ట్రాక్టర్ల బారులు
100 గొల్లపల్లె జైన్‌ఫ్యాక్టరీ వద్ద మామిడి కాయల లోడ్లతో బారులు తీరిన ట్రాక్టర్లు

గంగాధరనెల్లూరు మండలంలోని జైన్‌ ఫాంఫ్రెష్‌ ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడికాయల లోడ్లతో ట్రాక్టర్ల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది నియోజకవర్గవ్యాప్తంగా రైతులు 100 గొల్లపల్లె గల జైన్‌ఫ్యాక్టరీకి, తూగుండ్రం దారిలోని జైన్‌ఫ్యాక్టరీకి పది రోజులుగా తోతాపురి మామిడికాయలను తీసుకొస్తున్నారు. రోజురోజుకూ వీరి సంఖ్య పెరగడంతో జైన్‌ఫ్యాక్టరీకి ఎదురుగా రోడ్డు ఇరువైపులా ట్రాక్టర్లు బారులు తీరాయి. రెండు ఫ్యాక్టరీల వద్ద సుమారు 400 ట్రాక్టర్లు ఉన్నట్టు అంచనా. దీంతో ట్రాక్టర్‌లోని మామిడి కాయల అన్‌లోడింగ్‌కు 24 నుంచి 36 గంటల సమయం పడుతున్నట్లు రైతులు వాపోయారు. ఇక, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ ఆదేశాలతో ఈ రెండు ఫ్యాక్టరీల వద్ద తహసీల్దార్‌ సీ.కె.శ్రీనివాసులు, ఎంపీడీవో మనోహర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రైతులకు భోజన వసతి కల్పించారు. సుమారు 380 మందికిపైగా ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించినట్లు అధికారులు తెలిపారు.

- గంగాధరనెల్లూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 09 , 2026 | 01:30 AM