Share News

గిరిజన రైతు ఇంటిని కూల్చేసిన మదగజం

ABN , Publish Date - Sep 22 , 2026 | 01:33 AM

ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో పంట పొలాలపై దండయాత్ర చేస్తున్న మదగజం సోమవారం సాయంత్రం ఓ గిరిజనుడి పూరింటిపై దాడి చేసి కూలదోసింది.

గిరిజన రైతు ఇంటిని కూల్చేసిన మదగజం
సుబ్బరామాపురం వద్ద మదగజం కూల్చేసిన పూరిల్లు

ఎర్రావారిపాలెం,సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి); ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాల్లో పంట పొలాలపై దండయాత్ర చేస్తున్న మదగజం సోమవారం సాయంత్రం ఓ గిరిజనుడి పూరింటిపై దాడి చేసి కూలదోసింది.ఆదివారం రాత్రి చిన్నగొట్టిగల్లు మండలం దేవరకొండ గ్రామం నుంచి బయల్దేరిన ఈ ఒంటరి ఏనుగు చింతగుంట పంచాయతీ పచార్లవాండ్ల పల్లె సమీపంలో సోమవారం తిష్టవేసింది.సాయంత్రం చింతగుంట పంచాయతీ సుబ్బరామాపురం శివారున ఉన్న మామిడి తోటలోని గిరిజన రైతు నారాయణకు చెందిన పూరింటిపై దాడి చేసి కూల్చివేసింది.అక్కడే పనులు చేసుకుంటున్న నారాయణ తన ఇంటిపై దాడి చేస్తున్న ఏనుగును చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశాడు. గత యేడాది ఏప్రిల్‌ 25న చిట్టెచెర్ల వద్ద రైతు సిద్ధయ్యపై దాడి చేసి చంపేసింది ఈ ఏనుగేనని రైతులంటున్నారు.అలాగే ఈ ఏడాది జూన్‌లో పాకాల మండలం దేవినేని ఇండ్లు వద్ద తిమ్మారెడ్డి అనే రైతును చంపింది కూడా ఈ ఏనుగేనని రైతులు చెబుతున్నారు.

Updated Date - Sep 22 , 2026 | 01:33 AM