పెరిగిపోతున్న కూరగాయల ధరలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:55 AM
కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దిగుబడి తగ్గడం వల్లే ధరలు పెరిగాయని ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌వ్యాపారులు చెబుతున్నారు.
తిరుపతి సెంట్రల్, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్‌లో గత వారంతో పోలిస్తే.. తెల్లగడ్డలు కిలోపై రూ.35 పెరిగి రూ.240కి చేరుకున్నాయి. కిలోల వారీగా.. టమోటా రూ.60, బెండకాయలు రూ.65, గోరుచిక్కుడు రూ.80, వంకాయలు రూ.100, బీట్‌రూట్ రూ.50, పందిరి చిక్కుడు రూ.100, అల్లం రూ.160, క్యారెట్ రూ.75, బీరకాయలు రూ.60, కాకరకాయలు రూ.80, ముల్లంగి రూ.40, బీన్స్ రూ.120, క్యాబేజీ రూ.80, పచ్చిమిరప రూ.40 చేరుకుంది.అరటికాయలైతే జత రూ.25 పలుకుతున్నాయి. దిగుబడి తగ్గడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.