వరికోత యంత్రానికి కరెంటు తీగ తగిలి..!
ABN , Publish Date - May 23 , 2026 | 12:55 AM
వరికోత యంత్రానికి కరెంటు తీగ తగలడంతో, విద్యుదాఘాతానికి గురై రైతు కుమ్మర శివకుమార్ (42) మృతిచెందారు
పెద్దపంజాణి, మే 22(ఆంధ్రజ్యోతి): వరికోత యంత్రానికి కరెంటు తీగ తగలడంతో, విద్యుదాఘాతానికి గురై రైతు కుమ్మర శివకుమార్ (42) మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం పెద్దపంజాణిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పెద్దపంజాణికి చెందిన వకుమార్.. తన పొలంలో వరి పంట కోత దశకు వచ్చింది. దీంతో కోత యంత్రాన్ని ఆయన తన పొలంవద్దకు తీసుకువెళ్తుండగా విద్యుత్ వైరు తగిలింది. కోత యంత్రానికి విద్యుత్ సరఫరా కావడంతో అందులో ఉన్న శివకుమార్, డ్రైవర్ విద్యుదాఘాతానికి గురయ్యారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఎలా తప్పించుకోవాలో తెలియక విద్యుదాఘాతానికి గురైన శివకుమార్ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అతడిని స్థానికులు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. పోస్తుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలమనేరు వైద్యశాలకు తరలించారు.