క్రాంతి చైతన్యను విడుదల చేయాలి
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:34 AM
ఫ్లెక్సీలు పెట్టారనే పేరుతో తిరుపతిలో అరెస్టు చేసిన న్యాయవాది, పౌరహక్కుల నాయకుడు క్రాంతిచైతన్యను తక్షణం విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది.
ఆరుగురిపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
కార్పొరేట్ శక్తులకు భూముల ధారాదత్తం తగదు
16 తీర్మానాలను ఆమోదించిన పౌర హక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభ
తిరుపతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఫ్లెక్సీలు పెట్టారనే పేరుతో తిరుపతిలో అరెస్టు చేసిన న్యాయవాది, పౌరహక్కుల నాయకుడు క్రాంతిచైతన్యను తక్షణం విడుదల చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు తిరుపతి లోని బైరాగిపట్టెడలో గంధమనేని శివయ్య భవన్‌లో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇంటర్‌నెట్ నుంచి తీసుకున్న చిత్రాన్ని వాడినందుకు క్రాంతి చైతన్య సహా ఆరుగురిపై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఫ్లెక్సీలు ప్రింట్ చేసిన వ్యక్తిపైన కూడా ఇటువంటి కేసులు పెట్టడం ఏమిటని సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. 20వ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. సభల్లో 16 తీర్మానాలను చేశారు. వాటిలో కొన్ని..
ఫ కార్మికుల పనివేళలను 12గంటల నుంచి తిరిగి 8 గంటలకు తగ్గించాలి.
ఫ జేఎన్‌యూ విద్యార్థి నేతలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్, ఇతర రాజకీయ ఖైదీలపై మోపిన అక్రమ కేసులను రద్దు చేసి, విడుదల చేయాలి.
ఫ ముస్లిం, కైస్త్రవ మైనారిటీలపై ఆర్‌ఎ్‌సఎస్, బజరంగ్ దళ్ వంటి సంస్థలు చేస్తున్న అక్రమ దాడులను వెంటనే అరికట్టాలి.
ఫ విద్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న కాషాయీకరణను పౌర హక్కుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఫ వెనిజులాపై అమెరికా పెత్తనాన్ని, ఉక్రెయిన్ పై రష్యా దాడిని, పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ జరుపుతున్న అమానవీయ దాడులను పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తోంది.
ఫ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.
ఫ పౌర హక్కులను కాలరాస్తున్న నల్ల చట్టం ‘ఊపా’ ను తక్షణమే రద్దు చేయాలి. భారత న్యాయ సంహిత (బీఎన్‌ఎ్‌స)లో కొత్త రూపంలో ప్రవేశపెట్టిన దేశద్రోహ సెక్షన్లను పూర్తిగా తొలగించాలి.
ఫ అమరావతి ప్రాంతంలోని సాగు భూములను బడా పెట్టుబడిదారీ సంస్థలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు గంపగుత్తగా కట్టబెట్టడాన్ని నిలిపివేయాలి.