ప్రధాని పర్యటనపై సమీక్ష
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:37 AM
కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం .జరిగింది. ఐసర్ వేదికగా వచ్చేనెల 4వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న డీజీపీల, ఐజీపీల కాన్ఫరెన్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ,హోంమంత్రి
తిరుపతి(కలెక్టరేట్), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్‌లో బుధవారం రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధ్యక్షతన ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం .జరిగింది. ఐసర్ వేదికగా వచ్చేనెల 4వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరగనున్న డీజీపీల, ఐజీపీల కాన్ఫరెన్సుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ,హోంమంత్రి అమిత్‌షా హాజరు కానున్న సంగతి తెలిసిందే.సదస్సు భద్రతా ఏర్పాట్లపై దాదాపు 3గంటల పాటు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులతో హోంశాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ సమీక్షించారు.సదస్సుకు హాజరయ్యే ప్రముఖులకు వసతి, భద్రత విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయనే దానిపై శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఐజీ కాంతి రాణా టాటా, డీఆర్వో నరసింహులు, ఐబీ అధికారులతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ దర్శించుకున్నారు. ఆయన వెంట ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ వున్నారు.